కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టారేణుక అయోమయంలో ఉన్నారా.? టీడీపీతో బేరం కుదర్లేదా.? పార్టీకి మద్దతు ఇస్తూనె నేను పార్టీ ఖండువా కప్పు కోలేదని కొత్తగా సెలవిచ్చింది. అందుకె పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒక సారి టీడీపీలో చేరలేదని.మరో సారి వైసీపీలోనె కొనసాగుతన్నాని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో..టీడీపీ వైసీపీ నేతలల్లో ప్రస్తుతం బుట్టా రేణుక చర్చనీయాంశంగా మారారు.పార్టీ ఫిరాయించిన నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందె. ఈ వివాదం కొంత కాలంగా నానుతూ ఉంది. అయితె తాజాగా మంత్ర ఆదినారాయణరెడ్డి పిరాయింపులపై స్పందించడంతో మరో సారి తెరపైకి వచ్చింది.తామంతా రాజీనామాలు చేశామని.. స్పీకర్ కోడెల వాటిని ఆమోదించలేదంటూ బాంబు వేశారు మంత్రి ఆదినారాయణరెడ్డి.మీరు కూడా రాజీనామ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బుట్టా.. వింత సమాధానం చెప్పింది.''నేను అసలు ఇంకా టీడీపీలో చేరలేదు. అలాంటప్పుడు రాజీనామా ఎలా చేస్తా'' అని ప్రశ్నించింది. త్వరలో తన భర్త నీలకంఠ తో కలిసి టీడీపీలో చేరతానని.. ఆ తర్వాత రాజీనామా గురించి ఆలోచిస్తానని చెప్పారు.తాను కేవలం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితురాలినయ్యానని.. అంతేకానీ ఆ పార్టీలో చేరలేదని సమాధానమిచ్చారు. ఆమె సమాధానంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు.మద్దతు ఇవ్వడ మంటే పార్టీలో చేరడం కాదా? . మరి ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన నానా హంగామా చేస్తూ తన కార్యకర్తలతో ఆమె ఏమి చేసినట్లు?అది పార్టీలో చేరడం కాదా? దానిని పార్టీలో చేరడం అని అనరా? అను అనుమానం అందరిలో మొదలౌతోంది.బుట్టా రేణుక పార్టీ ఫిరాయించేందుకు చంద్రబాబు పెద్ద మొత్తంలో ప్యాకేజీ ఆఫర్ చేశారని గతంలో ప్రచారం జరిగింది. అయితే..ఆ ప్యాకేజీ విషయంలో చంద్రబాబుకి, బుట్టా కి తేడాలు వచ్చాయని.. అందుకే ఆమె కాసేపు టీడీపీలో చేరానని లేదు వైసీపీలో ఉన్నానని సెలవిచ్చారు. అసలు నిజం ఏంటో ఆమెకె తెలియాలి.
No comments:
Post a Comment